- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఐఏఎస్‌లపై దుష్ప్రచారం.. ఐపీఎస్ అసోసియేషన్ తీవ్ర ఖండన
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఐఏఎస్ (women IAS) అధికారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం (Telangana IPS Officers' Association) తీవ్రంగా ఖండించింది. ఈ రోజు(10-01-2026)న విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఐఏఎస్ అధికారుల సంఘానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. నిరాధారమైన ఆరోపణలతో మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత హేయమని, ఇది జర్నలిజం ముసుగులో జరుగుతున్న దాడి అని సంఘం అధ్యక్షుడు, డిజిపి బి. శివధర్ రెడ్డి (డిజిపి బి. శివధర్ రెడ్డి,) ఇతర సభ్యులు పేర్కొన్నారు.
మహిళా అధికారులు ఎంతో చిత్తశుద్ధి, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తిస్తున్నారని, వారిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం నైతికంగా సరికాదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని అసోసియేషన్ మండిపడింది. సంబంధిత మీడియా సంస్థలు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, అన్ని డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆ అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఐపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.






