- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హైదరాబాద్‌కు రండి’.. నాదిర్ గోద్రేజ్‌ను ఆహ్వానించిన మంత్రులు
ప్రపంచ ఆర్థిక వేదిక(WEF)–2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్‌తో సమావేశమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థిక వేదిక(WEF)–2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు(AI) వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపై మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతులు (స్కూళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సౌకర్యాలు) ఏర్పాటు చేయడం ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాదిర్ గోద్రేజ్‌ను హైదరాబాద్‌కు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.






