ఒక్కటంటే.. ఒక్క వార్డు కూడా ఓడిపోవద్దు: మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు విజయం పరంపర కొనసాగిస్తుండగా.. మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పరంపర కొనసాగుతోందని రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఒక్కటంటే.. ఒక్క వార్డు కూడా ఓడిపోవద్దు: మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం
X

దిశ, నేరేడుచర్ల: రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు విజయం పరంపర కొనసాగిస్తుండగా.. మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పరంపర కొనసాగుతోందని రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం రాత్రి నేరేడుచర్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయపరంపర కొనసాగగా తిరిగి ఫిబ్రవరి నెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పట్టణ ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నందున రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరపాలక సంస్థ వలే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, విద్యుత్, విద్య వైద్యము తదితర అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తుందని గుర్తుచేశారు.

ఒక్క వార్డు కూడా ఓడిపోవద్దు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుకు కృషి చేశామని భవిష్యత్తులో కూడా అదే అభివృద్ధి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖచిత్రం మారుస్తుందని పారదర్శక పాలన అందిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నేరేడుచర్ల ఓటర్లు చైతన్యవంతులని మున్సిపాలిటీలోని 15 వార్డులు కైవసం చేసుకోవాలని, ఒక్క వార్డు ఓడిపోయిన విజయం కాదని కార్యకర్తలను హెచ్చరించారు. మొదట కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు అనంతరం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని ఈ విధంగా తిరిగి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఇతర పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు, కాంగ్రెస్ ఓటు వేస్తే మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు.

పనిచేసిన వారికే గుర్తింపు

బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్‌లు పెట్టి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికే పరిమితమని విమర్శించారు, మున్సిపల్ ఎన్నికలపై ప్రతిరోజు సర్వే చేస్తూ నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. పనిచేసిన వారికే గుర్తింపు లభిస్తుందని, 24 గంటలు శ్రమిస్తూ ప్రతిరోజూ ఓటర్‌ను కలిసి విజయం వైపు పరుగులు తీయాలన్నారు. మొదట నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శంకర్ నాయక్, యారవ లక్ష్మి, బచ్చలకూరి ప్రకాష్, నన్నెపంగా శ్రీనివాస్, నూకల సందీప్ రెడ్డి, చింతమల్ల కోటేశ్వరమ్మ, తాళ్ల లావణ్య, ఇంజమూరు శ్రీకాంత్, మచ్చ వాణి, షేక్ మౌలాబి, షేక్ కలీం, బొలిశెట్టి లక్ష్మయ్య, వల్లం శెట్ల జ్యోతి, కొఢతం చిన్న వెంకటరెడ్డి లను మంత్రికి పరిచయం చేశారు, ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, భూక్య గోపాల్, అనంత శ్రీనివాస్ గౌడ్, బైరెడ్డి జితేందర్ రెడ్డి, తాళ్ల సురేష్ రెడ్డి రణపంగ నాగయ్య, పెర పోయిన వీరయ్య, పిడమర్తి రాజు, చిత్త నూరి సత్యనారాయణ, నక్క రమాదేవి, మచ్చ శీను, కొణతం ఆదిరెడ్డి, గుంటూరు శీను, గజ్జల కోటేశ్వరరావు, గాజుల పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story