- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంది రైతులకు బిగ్ అలర్ట్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు న్యాయమైన ధర కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతుల(Telangana Farmers)కు న్యాయమైన ధర కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తెలంగాణలో 4,99,393 ఎకరాల్లో కందులు సాగు చేశారని తెలిపారు. క్వింటాల్ కందులకు ఎమ్‌ఎస్పీ రూ.8 వేలుగా ఉందని అన్నారు. మార్చి 2026 వరకు కందుల కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ఈసారి రాష్ట్రంలో ఖరీఫ్సీజన్లో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్జిల్లా టాప్‌లో నిలిచింది. ఇప్పటి వరకు 6.93 లక్షల మెట్రిక్టన్నులు వరి ధాన్యం సేకరణతో నంబర్ వన్ జిల్లాగా ఉంది. రెండో స్థానంలో నల్లగొండ నిలవగా ఇక్కడ 5.23 లక్షల మెట్రిక్టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేపట్టారు. కాంగ్రెస్ సర్కార్కొలువు దీరిన తరువాత ఉమ్మడి ఈరెండు ఉమ్మడి జిల్లాలో ధాన్యం ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. పౌరసరఫరాల శాఖ కూడా ఇక్కడ అమ్మకాలు చేసిన రైతులకు వారం రోజుల్లో నగదు బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేయకుండా ప్రభుత్వం కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు.






