- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram: ప్రపంచంలోనే అతిపెద్ద జాతర
ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం అని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం(Medaram Festival) అని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మరోసారి మేడారం జాతర(Sammakka Saralamma Jatara) పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఈసారి జాతరకు రెండు కోట్లకు పైగానే భక్తులు వస్తారని అంచనా వేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమ్మక్క-సారలమ్మతో భావోద్వేగ బంధం ఉందని చెప్పారు. రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ఈనెల 18వ తేదీన మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారని వెల్లడించారు. మేడారంలోనే కేబినెట్ సమావేశం కూడా జరుగబోతోందని అన్నారు. ఈ మహా జాతరకు గత ప్రభుత్వం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తే తాము గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణానికే రూ.101 కోట్లు, ఇతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లు మంజూరు చేశామన్నారు. రెండు రోజుల్లో నిర్మాణాలన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. వైద్య, విద్యుత్తు, పంచాయతీ అధికారులు జాతర పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. గద్దెల ప్రాంగణం వద్ద తొక్కిసలాట ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామన్నారు.






