- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను నా శాఖల వరకే పరిమితం అవుతున్నా: మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
మేడారం జాతర పనులన్నీ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మేడారం జాతర పనులన్నీ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో సురేఖ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేసీఆర్‌తో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని అన్నారు. ప్రస్తుతం నేను నా శాఖల పనులకే పరిమితం అవుతున్నాను. గత పదేళ్లు ఇష్టారీతిన అడ్మినిస్ట్రేషన్ జరిగింది. కానీ ఇప్పుడు అలా లేదు. దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించబోతున్నారు. దూప దీప నైవేద్యంపై సోషల్ ఆడిట్ జరుగుతోంది. త్వరలోనే చాలా మందిపై వేటు పడే అవకాశం ఉంది. దేవాదయ, ఫారెస్ట్ శాఖలో స్టాప్ కొరత వెంటాడుతోంది.
భద్రాచలం to బాసర వరకు
టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భద్రాచలం to బాసర వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. మొత్తం మూడు సరక్యూట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి జరగబోతుంది. బాసర, భద్రాచలం, వేములవాడ ఫైల్‌లు సీఎం వద్ద పెండింగ్ ఉన్నాయి. YTD బోర్డు ఫైల్ సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది.. త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకోబోతున్నారని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.






