- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండను హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన సందర్భంగా నల్లగొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్(Nalgonda Municipal Corporation)గా ప్రకటించిన సందర్భంగా నల్లగొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కోమటిరెడ్డి పోస్టు పెట్టారు. ‘ప్రజా ప్రభుత్వంలో నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం. కార్పొరేషన్ హోదాతో కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకునే అవకాశం లభించింది. 25 నెలల్లోనే కార్పొరేషన్ హోదాను సాధించాము. గతంతో పోలిస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు, బ్రహ్మగారి గుట్ట–లతీఫ్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి–అనంతారం రోడ్లు, ఎస్ఎల్‌బీసీ పూర్తి లక్ష్యం, ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయించబడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా నల్లగొండను హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తాం. వివిధ పార్టీల నేతలంతా కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలి’ అని కోమటిరెడ్డి కోరారు.






