రాజేంద్రప్రసాద్ కొత్త సినిమాపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు

by Gantepaka Srikanth |

పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన “పాంచాలి పంచభర్తృక” సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.

రాజేంద్రప్రసాద్ కొత్త సినిమాపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన “పాంచాలి పంచభర్తృక” సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్యం ఒక మంచి ఔషధం. అపహాస్యం కాకుండా, ప్రేక్షకులను ఆరోగ్యకరమైన హాస్యంతో రంజింపజేసే ప్రయత్నమే ఈ చిత్రమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి, సినిమా కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిత్ర నిర్మాణ బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.

చాలాకాలం తర్వాత మంచి కామెడీ సినిమా

రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ ‘పాంచాలి పంచ భర్తృక’ను రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్.. అనేది సబ్ టైటిల్‌గా పెట్టారు. ఇందులో వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, 'జెమినీ' సురేష్, 'ర్యాప్' సింగర్ రోల్ రిడా హీరోలు. పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహ నిర్మాతలు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత మంచి కామెడీ సినిమాలో నటించాను అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొనడంతో అందరికీ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

Next Story