'దిశ' కథనానికి తక్షణ స్పందన.. మంత్రికి కృతజ్ఞతలు చెప్పిన రోగులు

by Disha Web Desk 2 |
దిశ కథనానికి తక్షణ స్పందన.. మంత్రికి కృతజ్ఞతలు చెప్పిన రోగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోగుల సౌకర్యార్థం, వేసవి కాలం దృష్ట్యా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సీలింగ్ ఫ్యాన్లు ఫిట్ చేశారు. దిశ పేపర్‌లో బుధవారం, 'గాంధీలో అడ్మిషనా? ఫ్యాన్ కొనండి' అంటూ ప్రచురితమైన వార్తకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి ఆర్తో ఫిమేల్ వార్డులో అధికారులు ఫ్యాన్లు పెట్టించారు. వేగంగా స్పందించిన మంత్రి హరీష్ రావు‌కు ఆ వార్డు రోగులు కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాక, గాంధీలో ప్రతీ వార్డునూ అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యుత్, ఫ్యాన్లు, వంటి పనులన్నీ వెను వెంటనే చేయిస్తున్నారు. దీంతో పాటు ఆసుపత్రి వార్డులను శానిటేషన్, ఇతర మరమ్మతులపై కూడా ఫోకస్ పెట్టారు.



Next Story