గనుల ఆదాయం రాష్ట్రాలదే: దేశవ్యాప్తంగా 1,374 గనులు మూత.. ఐబీఎం (IBM) కీలక నివేదిక!

by Malleboina Mahesh |

గనుల ఆదాయం రాష్ట్రాలకే! దేశవ్యాప్తంగా 1,374 గనులు మూత. ప్రైవేటు చేతిలో 2,408 గనులు ఉన్నాయని పార్లమెంటులో కేంద్ర మంత్రి సతీష్ దూబే వెల్లడి.

గనుల ఆదాయం రాష్ట్రాలదే: దేశవ్యాప్తంగా 1,374 గనులు మూత.. ఐబీఎం (IBM) కీలక నివేదిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఖనిజాల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయడం, వాటి ద్వారా వచ్చే ఆదాయాలను వసూలు చేయడం అనే అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ తెలిపింది. గత ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా సమకూరిన ఆదాయ వివరాలను కేంద్ర బొగ్గు, గనుల సహాయ మంత్రి సతీష్​దూబ్​ఇటీవల పార్లమెంటులో వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రభుత్వం ఆధీనంలో 234 గనులు కంపెనీలు ఉండగా, ప్రైవేటు వ్యక్తుల చేతిలో 2408 ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఆధీనంలో ఎక్కువగా ఒడిసాలో 48, మధ్యప్రదేశ్​లో 29, కర్నాటకలో 27 ఉన్నట్లు తెలిపారు.

ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎక్కువగా మధ్యప్రదేశ్​లో 431, తమిళనాడు 400, గుజరాత్​లో 306 కంపెనీలు ఉండగా ప్రస్తుతం గనులు పనిచేయక పోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. వాటికి చట్టపరమైన అనుమతులు లభించకపోవడంతో పాటు వాటి నిబంధనలను పాటించలేదన్నారు. తగిన నాణ్యత గల ఖనిజం లభించకపోవడం, ఆర్థికంగా లాభదాయకం కాని కార్యకలాపాలు, కోర్టు కేసులు, వివాదాలు ఉన్నట్లు వెల్లడించారు. గనుల బ్లాకులు పర్యావరణ సున్నిత ప్రాంతాలు కానీ నోటిఫై చేయబడిన వన్యప్రాణి, పులుల కారిడార్ల పరిధిలోకి రావడం, భూసేకరణ, స్థానిక సమస్యలు వంటి ఇతర అంశాలతో మూత పడ్డాయి. దేశవ్యాప్తంగా మినరల్స్​2642 ఉండగా అందులో 1268 పనిచేస్తుండగా, 1374 నాన్​వర్కింగ్​లో ఉన్నట్లు వివరించారు.


Next Story