almond milk: పాలు-బాదం పాలు.. పోషక విలువలు దేనిలో ఎక్కువ..?

by Kodari Anjali |

పాలు(milk) తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. పాలు రోగ నిరోధక శక్తి(Immunity)ని పెంపొందిస్తాయి.

almond milk: పాలు-బాదం పాలు.. పోషక విలువలు దేనిలో ఎక్కువ..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాలు(milk) తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. పాలు రోగ నిరోధక శక్తి(Immunity)ని పెంపొందిస్తాయి. అలాగే చర్మానికి మేలు చేస్తాయి. జుట్టు హెల్త్(Hair health) కూడా బాగుంటుంది. బోలు ఎముకల వ్యాధి(Osteoporosis) రాకుండా ఉంటుంది. హృదయ నాళ ఆరోగ్యం(Cardiovascular health), దంతాలను ఆరోగ్యవంతం(Healthy teeth)గా ఉంచడంలో పాలు ఎంతో ఉపయోగపడుతాయి. జీర్ణ క్రియ(Digestion)కు తోడ్పడటంలో, నిరాశను ఎదుర్కోవటానికి సహాయం చేస్తాయి.

అయితే పాల కంటే బాదం పాలలో పోషకాలు (Nutrients) ఎక్కువగా ఉంటాయా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. మనకు ముందుగా హెల్తీ ఫుడ్ అనగానే డ్రై ఫ్రూట్స్(Dry fruits) గుర్తుకు వస్తాయి. చాలా మంది డ్రై ఫ్రూట్స్‌లలో ఒకటైన బాదం పప్పులకు ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తారు. బాదం గుండె ఆరోగ్యాన్ని(Heart health) మెరుగుపరుస్తుంది. బాదం పాలలో మోనోశాచురేటెడ్ కొవ్వులు(Monounsaturated fats) దట్టంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌(bad cholesterol)ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. బాదం పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

అయితే బాదం పాలలో కూడా పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది. ఒక కప్పుకు దాదాపు 300-450 మిల్లీ గ్రాములు ఉంటుందట. బాదం పాలలో సమతుల్య పాస్పరస్ కంటెంట్ (Passover content) అధికంగా ఉంటుంది. అలాగే బాదం పాలల్లో జీర్ణక్రియ టైంలో సులభంగా అనిపిస్తాయి. దాదాపు పాలల్లో, బాదం పాలల్లో పోషక విలువలు సమానంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story