తండ్రి కాబోతున్న రానా..! క్లారిటీ ఇచ్చిన మిహికా బజాజ్

by Disha Web Desk 19 |
తండ్రి కాబోతున్న రానా..! క్లారిటీ ఇచ్చిన మిహికా బజాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ నటుల్లో దగ్గబాటి రానా పేరు మొదటగా వినిపిస్తోంది. పాత్రదైనా సరే దానికి 100శాతం న్యాయం చేయగల సత్తా ఉన్న రానా.. బాహూబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమాలో విలన్ పాత్ర పోషించిన భళ్లాల.. పవన్ కళ్యాణ్‌కు ధీటుగా నటించి డానియల్ శేఖర్‌గా అభిమానులను అలరించాడు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం రానా గురించి ఓ వార్త సోషల్ మీడిలో చెక్కర్లు కొడుతోంది. గతేడాది రానా, మిహికా బజాజ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్‌ కపుల్‌ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల రానా, మిహికా ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. ఆ ఫొటోలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఓ నెటిజెన్ మిహికాను 'మీరు బొద్దుగా కనిపిస్తున్నారు.. ప్రెగ్నెంటా అని ప్రశ్నించాడు. దీనికి కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన మిహికా ' అలాందేమి లేదు.. పెళ్లి తర్వాత కాస్త బరువు పెరిగానంతే' అంటూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది.

Next Story

Most Viewed