- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ranbir Kapoor, Alia Bhatt : వెడ్డింగ్ అప్‌డేట్.. ఫుడ్ మెనూ లీక్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఏప్రిల్ 14న ఘనంగా వీరి వెడ్డింగ్ జరగనుంది. ఈ క్రమంలో తాజాగా నెట్టింట ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అలియా, రణ్‌బీర్ కపూర్ వెడ్డింగ్‌లో పెట్టే భోజనాల లిస్ట్ రెడీ అయిపోయిందంటూ ఓ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 'మీరు కోరడమే ఆలస్యం ఏ డిష్ అయినా మీ ముందుకు వస్తుంది. వీరిద్దరి వెడ్డింగ్ కోసం నీతు కపూర్ భారీ ప్లాన్ చేశారు. భోజనాలు ఏర్పాటు చేసేటందుకు ఢిల్లీ, లక్నోల నుంచి మాస్టర్ చెఫ్‌లను తీసుకొచ్చింది. తన కొడుకు పెళ్లికి వచ్చిన వారికి నచ్చిన వంటకాలతో వారిని సంతోష పెట్టాలని ఇలా ప్లాన్ చేశారు' అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. మరి ఇందులో చెప్పినట్టుగానే నీతు కపూర్ భారీ ప్లాన్ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే వెడ్డింగ్ డే వరకు ఆగాల్సిందే.
Gold standard
— Abhinandan Sekhri (@AbhinandanSekhr) April 12, 2022
Biggest revelation pic.twitter.com/IkirKtSTb7






