తాతల వయసున్న వారే అసభ్యకరంగా ప్రవర్తించారు.. మౌనీ రాయ్ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy)హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాతల వయసున్న వారే అసభ్యకరంగా ప్రవర్తించారు.. మౌనీ రాయ్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy)హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకకు అతిథులుగా వచ్చిన కొందరు వృద్ధులు మరియు పురుషులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను స్టేజ్ వైపు వెళ్తున్న సమయంలో ఫోటోలు తీసుకునే నెపంతో కొందరు వ్యక్తులు తన నడుముపై చేతులు వేసి వేధించారని, దానిని తాను అభ్యంతరపెడితే వారు మరింత దురుసుగా ప్రవర్తించారని మౌనీ రాయ్ పేర్కొన్నారు.తాతల వయసున్న వారు కూడా అలా ప్రవర్తించడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అంతటితో ఆగకుండా, తాను స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులు స్టేజ్ కింద నిలబడి అసభ్యకరమైన సైగలు చేస్తూ, అసభ్య పదజాలంతో దూషించారని మౌనీ తెలిపారు.

అంతేకాకుండా, లో-యాంగిల్‌లో వీడియోలు తీస్తూ తనను అవమానపరిచారని, ఆర్గనైజర్లు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదని ఆమె మండిపడ్డారు. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మౌనీ రాయ్ "నాలాంటి సీనియర్ నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వస్తున్న యువతుల పరిస్థితి ఏంటి?" అని ఆమె నిలదీశారు. కళాకారుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. మహిళలను కేవలం ఒక వస్తువులా చూసే మనస్తత్వం మారాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం మౌనీరాయ్ పోస్టులు నెట్టింట దుమారం రేపుతున్నాయి.




Next Story