AP News: ఏపీలో కరెంట్ లేదా పుష్ప.. ట్రెండ్ అవుతున్న మీమ్స్

by Dishafeatures2 |
AP News: ఏపీలో కరెంట్ లేదా పుష్ప.. ట్రెండ్ అవుతున్న మీమ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో మీమ్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. పవర్ కట్‌పై ప్రజలు ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల ఒక ఆసుపత్రిలో కరెంట్ లేక సెల్ ఫోన్ లైట్ల మధ్య బాలింతకు ప్రసవం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రాలో కరెంటు కోతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం అవుతోంది. వ్యవసాయానికి కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. పరిశ్రమలకు అక్కడి ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది. అయితే పవర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక, వేసవి కాలం కావడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఏపీలో విద్యుత్ కొతలపై మీమ్‌లు మాత్రం తెగ వైరల్‌గా మారుతూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం బాగా ట్రెంగింగ్‌లో ఉన్న మీమ్‌లు ఎంటో చూద్దాం..?










Next Story

Most Viewed