వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం.. కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

"మన శంకరవరప్రసాద్ గారు" సినిమా సక్సెస్ మీట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.

వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం.. కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి వచ్చిన "మన శంకరవరప్రసాద్ గారు" సినిమా సక్సెస్ మీట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ, అన్నంలాగే సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టదని, జీవితాంతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటానని అన్నారు. ఇక చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ పలు హాట్ కామెంట్స్ చేసారు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఎలా బిహేవ్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని అన్నారు.

పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, ప్రొఫెషనల్ గ ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఫ్రెష్ టాలెంట్ కు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని, వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటామని చిరంజీవి వెల్లడించారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడికి, ఎడిటర్ తమ్మిరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Next Story