- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: ప్రభుత్వ విప్ వేముల
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన AICC ప్రతినిధి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కాగా ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో బీజేపీ ‘ఓటు చోరీ’ (Vote Theft) కి పాల్పడుతుండగా, ఇప్పుడు ఏకంగా ‘సీటు చోరీ’ (Seat Theft) కి దిగడం అక్షేపణీయమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు నిలబడే గొప్ప మహిళా నాయకురాలైన మీనాక్షి నటరాజన్‌ను తప్పుడు కారణాలతో అడ్డుకోవడం అత్యంత బాధాకరమని, ఈ అన్యాయంపై దేశ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు.
తెలంగాణలోని ఒక కోర్టు నోటీసు ఆధారంగా ఎటువంటి క్రిమినల్ ఎఫ్ఐఆర్ (FIR) లేకపోయినప్పటికీ కేవలం సాంకేతిక కారణాలను సాకుగా చూపి నామినేషన్‌ను రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని వీరేశం అభిప్రాయపడ్డారు. ఒక సాధారణ మహిళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తట్టుకోలేక అడ్డుకోవడం.. మహిళల పట్ల బీజేపీకున్న అసలు వైఖరిని, వారి వ్యతిరేక సంస్కృతిని బయటపెడుతోందని విమర్శించారు. అధికారానికి తలొగ్గే ఏక్‌నాథ్ షిండే లాంటి నాయకులను ప్రోత్సహిస్తూ.. ఎన్నికల సంఘం (ECI) వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ దేశవ్యాప్తంగా వ్యవస్థలను బలహీనపరుస్తోందని మండిపడ్డారు. బీజేపీ వల్ల దేశ రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో పలుమార్లు హెచ్చరించిన మాటలు నేడు అక్షరాలా రుజువవుతున్నాయని, సామాన్య వ్యక్తికి పోటీ చేసే హక్కు కూడా నేడు సురక్షితంగా లేదని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆవేదన వ్యక్తం చేశారు.






