- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క సారక్క మహా జాతరకు భక్తులు పోటెత్తున్నారు. ఈ నెల 28న జాతర అధికారికంగా ప్రారంభం కానుండగా.. గత 10 రోజుల నుంచే మేడారం జనసంద్రం అయింది. జాతరకు ఇంకా మూడు రోజులు ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వచ్చి శివార్లలో క్యాంపులు వేసుకుని, జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, బంగారం సమర్పిస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష మంది వరకు దర్శనం చేసుకున్నట్లు అంచనా. మేడారం ప్రధాన రోడ్లు, గద్దెల పరిసరాలు, జంపన్న వాగు ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తిస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మేడారం బాట పట్టారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను ‘మేడారం 2.0’గా నిర్వహిస్తూ.. డ్రోన్లు, కెమెరాలు, భారీ పోలీసు బందోబస్తు, తాగునీరు, వైద్య శిబిరాలు వంటి అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 28న సారలమ్మ రాకతో ప్రారంభం అయ్యే ఈ మహా జాతర, 31న సమ్మక్క, సారలమ్మ తిరిగి వనాలకు వెళ్లిపోవడంతో ముగియనుంది. ఈ ఏడాది 3 కోట్ల మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.






