- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఆగయా..!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ఆర్సీబీకి తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది.- latest Telugu news

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ఆర్సీబీకి తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. పంజాబ్‌పై భారీ స్కోరు చేసిన.. బౌలర్ల వైఫల్యం వల్ల దానిని కాపాడుకోలేక తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. అయితే బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్స్ పుంజుకున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్‌కత్తా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి తక్కువ పరుగులకే కట్టడి చేసి.. విజయం సాధించారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఆర్సిబీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది జట్టు యాజమాన్యం. ఇటీవలే తన ప్రేయసిని వివాహమాడిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. జట్టులో చేరేందుకు ఇండియాకు పయానమయ్యాడు. ఈ విషయాన్ని 'లెట్స్ గో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు' అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మాక్సీ జట్టులో చేరితే ఆర్సీబీ మరింత స్ట్రాంగ్ కానుంది. గతేడాది నుండి బెంగళూర్‌కు ఆడుతున్న మాక్సీ.. గత సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.






