- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మీపురంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, కన్నాయిగూడెం: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న అరాచక విధానాలు, మోసపూరిత రాజకీయాలకు నిరసనగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. కేసీఆర్, కేటీఆర్, ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు నాయకత్వంపై నమ్మకంతో సుమారు 30 మంది యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరడం జరిగింది. లక్ష్మణ్ బాబు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల' పేరుతో పక్షపాతం అర్హులైన పేదలకు కాకుండా, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు చెప్పిన వారికే, వారి అనుచరులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
నిజమైన పేదలను కాదని, తమకు నచ్చిన వారికే ఇళ్లు ఇచ్చుకుంటూ పోవడం కాంగ్రెస్ పక్షపాత బుద్ధికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అమలు కాని, సాధ్యం కాని 420 అబద్ధపు హామీలు ఇచ్చి, ప్రజలను వంచించి కాంగ్రెస్ గద్దెనెక్కిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, వేధింపులు ఎక్కువయ్యాయని, సొంత పార్టీలోనే అంతర్గతంగా కుట్రలు, మోసాలు పెరిగిపోయాయని, నమ్ముకున్న వారిని ముంచే సంస్కృతి ఆ పార్టీదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కేవలం బీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని, జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు నాయకత్వంలో పార్టీలో చేరిన యువత అంతా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి, ప్రజల హక్కుల కోసం శ్రమిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు మండల ఉపాధ్యక్షులు. సర్వేశ్ ఓడబలిజ సంఘ అధ్యక్షులు. రాంబాబు,రాంబాబు, సాయి, నాగరాజు, ప్రవీణ్, సాయితేజ, నాగేష్ చందు, రవి, వినోద్, ప్రశాంత్,రాజు, మహేష్, పుల్లయ్య, ఆదినారాయణ, రామయ్య, ప్రణయ్ మనోజ్, వినయ్, రాజుకుమార్, సాయికిరణ్, అనిల్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి భారీగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య, నామాని తిరుపతి,పూజారి కిషోర్,కావిరి చిన్నికృష్ణ,చిలుముల రాంబాబు, దుర్గం నారాయణ, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు తాటి కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్ రావు, ఎండి వాలి బాబా, తాడూరి రఘు, కొమరం ధనలక్ష్మి, యలవర్తి శ్రీనివాస్, కన్నాయిగూడెం మండల నాయకులు ఉద్యమకారులు మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది .






