- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో భారీగా పెరిగిన 'మీసేవ 'ఛార్జీలు.. నేటి నుంచే అమలు!
తెలంగాణలో మీసేవ ఛార్జీల మోత! ఏ-కేటగిరీ సేవలకు ₹62, బి-కేటగిరీకి ₹80 వసూలు. నేటి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు.

దిశ, వెబ్ డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి రోజే తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, బిల్లు చెల్లింపుల కోసం వసూలు చేసే యూజర్ ఛార్జీలను భారీగా పెంచుతూ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. గతంలో కనిష్టంగా రూ. 35 ఉన్న సర్వీస్ ఛార్జీని ఏకంగా రూ. 62 కు పెంచినట్లు చూపించే ఓ పోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే (ఏప్రిల్ 1, 2026) అమలులోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు.
తాజా సవరణ ప్రకారం, తక్షణమే లభించే ఏ-కేటగిరీ (సర్టిఫికెట్ ప్రింట్ వంటివి) సేవలకు రూ. 62 వసూలు చేయనుండగా, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాల వంటి బి-కేటగిరీ సేవలకు రూ. 80 గా ధరను నిర్ణయించారు. వీటితో పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆర్టీఏ సేవలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తులపై కూడా అదనపు భారం పడనుంది. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఈ సేవలపై ఒక్కసారిగా దాదాపు 80 శాతం వరకు ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ మీ సేవ చార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.






