బంగారం పేరుతో భారీ మోసం.. రంగంలోకి దిగిన పోలీసులు !

by Batti.Sumithra |

దిశ జిల్లా టాబ్లాయిడ్‌లో శనివారం ప్రచురితమైన ‘బంగారం పేరుతో ఘరానా మోసం’ వార్తకు ఏటూరునాగారం ఎస్‌ఐ బొంకూరి మహేష్ స్పందించారు.

బంగారం పేరుతో భారీ మోసం.. రంగంలోకి దిగిన పోలీసులు !
X

దిశ, మంగపేట : దిశ జిల్లా టాబ్లాయిడ్‌లో శనివారం ప్రచురితమైన ‘బంగారం పేరుతో ఘరానా మోసం’ వార్తకు ఏటూరునాగారం ఎస్‌ఐ బొంకూరి మహేష్ స్పందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడిన బంగారం ఇస్తామని నమ్మించి వసూళ్లకు పాల్పడుతున్న మైనార్టీ జంట కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

వారి మోసాలకు గురైన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన చిదురాల వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మహేష్ వెల్లడించారు. గుప్తనిధుల పేరుతో మోసాలు చేయడం, బంగారం ఆశ చూపించడం, డబ్బులకు అధిక వడ్డీలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టడం వంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు గ్రామాల్లో గానీ, వాడల్లో గానీ కనిపించినా లేదా వారి గురించి సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు.

Next Story