ఇందిరాపురం లో భారీ అగ్ని ప్రమాదం.. 10 ప్లాట్లలో చిక్కుకున్న ప్రజలు

by Malleboina Mahesh |

ఘాజియాబాద్‌లోని గౌర్ గ్రీన్ అవెన్యూ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం! 9, 10వ అంతస్తుల్లోని ఫ్లాట్లకు విస్తరించిన మంటలు. కొనసాగుతున్న సహాయక చర్యలు.

ఇందిరాపురం లో భారీ అగ్ని ప్రమాదం.. 10 ప్లాట్లలో చిక్కుకున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురంలో అభయ్ ఖండ్ ప్రాంతంలో ఉన్న గౌర్ గ్రీన్ అవెన్యూ సొసైటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. అపార్ట్‌మెంట్ సముదాయంలోని 9, 10వ అంతస్తుల్లో ప్రారంభమైన మంటలు వేగంగా పక్కనే ఉన్న సుమారు 8 నుండి 10 ఫ్లాట్లకు విస్తరించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. నల్లటి పొగ ఆకాశాన్ని చుట్టుముట్టడంతో సమీపంలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే నుండి కూడా మంటలు స్పష్టంగా కనిపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story