భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

by Malleboina Mahesh |

ఢిల్లీ మాల్వియా నగర్‌లోని ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ బేస్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం.

భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మాల్వియా నగర్ ప్రాంతంలోని ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ (‘Lemon Green Restaurant’) బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం ప్రకారం, రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి.

ఈ ప్రమాదంపై బుధవారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక సేవల (DFS) విభాగానికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి పలు అగ్నిమాపక శకటాలను (Fire Tenders) పంపించినట్లు ఫైర్ అధికారి తెలిపారు.. ప్రమాద సమయంలో భవనం లోపల చాలా మంది చిక్కుకుపోయినట్లు అనుమానించడంతో, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించారు. మంటలను అదుపు చేస్తూనే లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story