- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ పేలుడు.. 18 కి చేరిన మృతుల సంఖ్య
మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థాంగ్‌స్కై (Thangskai) ప్రాంతంలోని బొగ్గు గనిలో కార్మికులు.. బొగ్గు తవ్వుతుండగా ఎవరూ ఊహించని విధంగా.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 18 మందికి చేరినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గని లోపల మైనింగ్ కోసం వినియోగించిన డైనమైట్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదం జరిగిన గనిని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 'రాట్-హోల్' (Rat-hole) గనిగా అధికారులు గుర్తించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిషేధించినప్పటికీ, ఇక్కడ రహస్యంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. పేలుడు తీవ్రతకు గనిలోని ఒక భాగం కూలిపోవడంతో, లోపల మరింత మంది చిక్కుకుపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందిస్తూ, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ₹3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.






