- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మేము సృష్టించే రక్తపాతాన్ని ఊహించలేరు’.. భారత్‌కు మసూద్ అజర్ హెచ్చరిక
భారత్‌కు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మసూద్ అజర్ ఆడియో విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌కు జైషే మహ్మద్(ఉగ్రవాద సంస్థ) చీఫ్ మసూద్ అజర్(Jaish chief Masood Azhar) వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మసూద్ అజర్ విడుదల చేసిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తన వద్ద ఇంకా వెయ్యి మందికి పైగా సూసైడ్ బాంబర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఏ క్షణమైనా భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్‌లోకి చొరబడి దాడులు చేయడానికి తన అనుచరులు కొన్నేళ్లుగా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని.. వారికి తానే సర్దిచెప్పుకుంటూ వస్తున్నాను. ఒకరోజు తాను వారిని అడ్డుకోను.. అప్పుడు వారు సృష్టించే రక్తపాతం ఎవరూ ఊహించలేరు అని మసూద్ మాట్లాడినట్లుగా ఆడియో ఉంది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత.. భారత దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి. ఆ సమయంలో భారీగా మసూద్ సైన్యాన్ని భారత బలగాలు మట్టుబెట్టాయి. తప్పకుండా భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ సమయంలో మసూద్ శపధం చేశారు. అయితే.. తాజాగా మసూద్ చేసిన హెచ్చరికలతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. మసూద్ ఆడియో అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది.






