హోటల్‌కు పిలిపించి మైనర్ బాలుడిపై వివాహిత అఘాయిత్యం

by Malleboina Mahesh |

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం! మైనర్ బాలుడిపై వివాహిత లైంగిక దాడి. ఏప్రిల్ 1న హోటల్‌లో అఘాయిత్యం. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

హోటల్‌కు పిలిపించి మైనర్ బాలుడిపై వివాహిత అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళా సోషల్ మీడియాలో పరిచయం అయిన మైనర్ బాలుడిని హోటల్ కి పిలిచి.. అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింతైన కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మైనర్ బాలుడిని హోటల్‌కు పిలిపించుకుని, ఒక వివాహిత మహిళ అతనిపై లైంగిక దాడికి పాల్పడింది. సిటీ కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడైన మైనర్ బాలుడికి, సదరు మహిళకు కొంతకాలం క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారడంతో, వారు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1, 2026న ఆ మహిళ బాలుడిని కలవడానికి స్థానిక హోటల్‌కు పిలిపించింది.

బలవంతం చేయడంతో హోటల్ గదిలోకి చేరుకున్న బాలుడిపై సదరు మహిళ ఒత్తిడి తెచ్చి లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, సోషల్ మీడియాలో వివరాలు బయటపెడతానని బాలుడిని భయపెట్టి బెదిరించింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆ బాలుడు చివరికి తన కుటుంబ సభ్యులకు జరిగిందంతా వివరించాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 3న పోలీసులు నిందితురాలిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మైనర్లపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story