- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణతంత్ర దినోత్సవ వేళ మావోయిస్టుల కుట్ర భగ్నం
గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తుండగా, విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టుల ఎత్తుగడను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

X
దిశ, భద్రాచలం: గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తుండగా, విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టుల ఎత్తుగడను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఛత్తీస్‌గఢ్ సుక్మా, బీజాపూర్ సరిహద్దులోని రెండు మావోయిస్టు ఆయుధాల డంపులు ఆదివారం సిఆర్‌పిఎఫ్ 150 బెటాలియాన్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యం అయ్యాయి. శనివారం సైతం బీజాపూర్ జిల్లా, మద్దెడ్ పోలీస్టేషన్ పరిధిలోని బందెపర, నీలమడుగు అటవీ ప్రాంతంలో 16 ఐఈడీ ప్రెషర్ బాంబులు, 100 కేజీల పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవాల సమయంలో ఎటువంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి అడవులను గాలిస్తున్నాయి.
READ MORE ....
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. 982 మంది పోలీసులకు అవార్డులు
Next Story






