- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల ఆయుధ కారాగారం ధ్వంసం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేసారు. మహారాష్ట్రలోని పోమ్కే-బినగుండ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించిన భద్రతా బలగాలు దానిని నాశనం చేసారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను అత్యంత రహస్యంగా నిర్వహించాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో రహస్యంగా సాగుతున్న ఈ కేంద్రాన్ని ముట్టడించిన పోలీసులు, అక్కడ ఆయుధాల తయారీకి ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, ముడి పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టుల ఆయుధ ఉత్పత్తి, సరఫరా నెట్‌వర్క్‌కు పోలీసులు కోలుకోలేని దెబ్బ కొట్టారని అధికారులు వెల్లడించారు. స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యూహాలకు ఈ కేంద్రం ఒక ప్రధాన వనరుగా ఉండేదని, దీన్ని సకాలంలో గుర్తించి నాశనం చేయడం వల్ల ఆ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను పెద్ద ఎత్తున కట్టడి చేసే అవకాశం లభించిందని భద్రతా విభాగాలు భావిస్తున్నాయి.






