- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్భవతిని చేసి ముఖం చాటేశాడు.. కన్నీరు మున్నీరైన Mandana Karimi
దిశ, సినిమా : ప్రముఖ మోడల్, నటి మందనా కరిమి అతిపెద్ద మోసానికి గురైనట్లు చెప్పింది.

దిశ, సినిమా : ప్రముఖ మోడల్, నటి మందనా కరిమి అతిపెద్ద మోసానికి గురైనట్లు చెప్పింది. ప్రస్తుతం 'లాక్ అప్' షోలో కంటెస్టెంట్‌గా ఉన్న నటి.. ఓ ప్రముఖ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, తర్వాత ఇల్లీగల్ ఎఫైర్‌గా ముద్రవేశారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె స్టోరీ విన్న తర్వాత హోస్ట్ కంగనా సహా షో లోని ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే పెళ్లైన ఐదు నెలలకే వ్యక్తిగత కారణాలతో భర్త గౌరవ్ గుప్తా నుంచి విడిపోయానన్న మందన.. అదే టైమ్‌లో ఒక ఫిల్మ్ మేకర్‌తో సీక్రెట్ రిలేషన్‌షిప్ ఏర్పడిందని చెప్పింది.
మహిళా హక్కుల పట్ల అతని ఆదర్శ భావాలు నచ్చి, క్లోజ్‌గా ఉన్నానని వివరించింది. దీంతో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశామని, కానీ చివరకు నన్ను ఒంటరిదాన్ని చేశాడని కన్నీరుమున్నీరైంది. ఈ షాక్‌లో కొంతకాలం ఇంటినుంచి బయటకు రాలేదన్న కరిమి.. కొంతమంది ఫ్రెండ్స్ సహకారంతో కొత్త లైఫ్ ప్రారంభించానని, ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని చెప్పుకొచ్చింది.
- Tags
- Mandana Karimi






