- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ల రాజేష్ లాకప్ డెత్ విచారణ వేగవంతం చేయండి : మంద కృష్ణ మాదిగ
కర్ల రాజేష్ లాకప్ డెత్ విచారణ వేగవంతం చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేసారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కొదాడకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ పై విచారణ వేగవంతం చేయాలని ఎమ్ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు , పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. పది అంశాలను ప్రస్తావిస్తూ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ కు ప్రధాన కారకుడైన చిలుకూరు పోలీస్ స్టేషన్ కు అధికారిగా ఉన్న సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని కొరారు. లాకప్ డెత్ జరిగిన సమయంలో విధులలో ఉన్న కొదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం చేశారని పేర్కోన్నారు. కోదాడ నూతన డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి కూడా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే తెలిపారు. సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహా పై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లోని సెక్షన్ 4 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






