- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
by S Gopi |
దిశ, ఏటూరునాగారం: బైక్ అదుపు తప్పి బ్రిడ్జి డివైడర్ ను ఢీకొని..Man killed in Road Accident in Tadwai

X
దిశ, ఏటూరునాగారం: బైక్ అదుపు తప్పి బ్రిడ్జి డివైడర్ ను ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యక్కపేట గ్రామానికి చెందిన చింతల సమ్మయ్య మరొక వ్యక్తి రాంబాబుతో కలిసి నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం నార్లాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో బయ్యక్కపేట గ్రామానికి సమీపాన కప్పల తోగు బ్రిడ్జి వద్ద బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న బ్రిడ్జి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






