- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొబ్బిల్లంకలో ఘోరం.. భార్య, అత్తను వేట కొడవలితో నరికి చంపిన కిరాతకుడు!
బొబ్బిల్లంకలో జంట హత్యలు! భార్య, అత్తను వేటకొడవలితో నరికి చంపిన వ్యక్తి. కుటుంబ గొడవలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. నిందితుడు అరెస్ట్.

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను, అత్తను దారుణంగా హత్య చేశాడు. ఈ పెను విషాదం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి తన భార్యను, అత్తను వేట కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. చొడదాసి సీతారామరాజు తన మొదటి భార్యతో విడిపోయి వేరేగా ఉంటున్నారు అతని వివాహం కూడా చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి మొదటి భార్య చోడదాసి లత (30) ను, అత్త గుమ్మడి లక్ష్మి (50) సోమవారం రాత్రి మరోసారి వివాదం తలెత్తడంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితుడు ఇంట్లో ఉన్న వేటకొడవలితో భార్యపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అత్తను కూడా విడిచిపెట్టకుండా నరికి చంపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటలకు సీతానగరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు.
వెంటనే ఆలమూరు పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ గొడవలే ఈ హత్యలకు ప్రాథమిక కారణమని భావిస్తున్నప్పటికీ, దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘోరంతో బొబ్బిల్లంక గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






