- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరం చేసి 26 ఏండ్లవుతోంది.. అంతా మరిచిపోయారనుకున్నాడు... చివరకు..
దిశ, వెబ్ డెస్క్: నేరం చేసిన ఓ వ్యక్తిని 26 ఏళ్ల తర్వాత.. man gets caught by police after 26 years in Chhattisgarh

దిశ, వెబ్ డెస్క్: నేరం చేసిన ఓ వ్యక్తిని 26 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతూ అంతా మరిచిపోయారు నన్నెవరూ ఆ విషయం గురించి అడగరు అనుకుని ఇంటికి తిరిగొచ్చాడు. సమాచారమందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ వ్యాపారి తన ఇంటిపక్కనే ఉండే ఓ యువతిని 26 ఏళ్ల క్రితం ఎవరికీ తెలియకుండా అపహరించాడు. అనంతరం ఆమెను ఆగ్రాకు తీసుకెళ్లి అక్కడ ఓ ధనవంతుడికి అమ్మేసి ఇంటికి తిరిగొచ్చాడు. 26 ఏళ్ల తర్వాత ఆ యువతి అక్కడి నుంచి ఎలాగొలాగో తప్పించుకుని ఇంటికి చేరింది. తనని పక్కింటి వ్యక్తే అపహరించి.. ఆగ్రాలో అమ్మేశాడని తల్లిదండ్రులకు చెప్పింది. అప్పటి నుంచి ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. తన తల్లిని చూసేందుకని నిందితుడు ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.






