- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కాలువలో పడి వ్యక్తి మృతి
దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని మంగువాయిబాడువ..Man dies after falling into ditch

X
దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని మంగువాయిబాడువ గ్రామంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై ఒక వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిన్న కమలాపురం గ్రామానికి చెందిన తెల్లం పశ్శయ్య (50) బంధువులకు ఫంక్షన్ కార్డులు పంచడానికి వెళ్లి తన వాహనంపై రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా మంగువాయి బాడవ గ్రామానికి ఆనుకొని ఉన్న తాలిపేరు ప్రాజెక్టు కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీయించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






