రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

by Vinod kumar |   (  Updated:2022-03-11 16:34:02  IST  )

దిశ, మియాపూర్: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న - Man commits suicide by falling under train

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మియాపూర్: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్, శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో చోటు చేసుకుంది. రైల్వే యస్‌ఐ ధారాసింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలిని చేరుకొని పరిశీలించారు. రైలు పట్టాలపై పడుకోవడం తో గుర్తు తెలియని రైలు వెళ్లడంతో తల, శరీరం వేర్వేరుగా పడ్డట్లు ధృవీకరించారు. అతని వద్ద దొరికిన ఆధారాలను బట్టి మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన శేషయ్య (36)గా గుర్తించారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. శేషయ్య ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story