బైక్ వెరైటీగా కొన్నాడు... 10 గంటలు చుక్కలు చూసిన షోరూమ్ సిబ్బంది

by Disha Web |
బైక్ వెరైటీగా కొన్నాడు... 10 గంటలు చుక్కలు చూసిన షోరూమ్ సిబ్బంది
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాపులర్ అవ్వాలంటే కండలు పిండి స్టంట్స్ చేయాల్సిన పనిలేదు. రేయింబవళ్లు కష్టపడాల్సిన అవసరమూ లేదు. కొత్తగా ఆలోచిస్తూసోషల్ మీడియా ద్వారా ఇట్టే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు యువకులు. సరిగ్గా ఇలానే ఓ వ్యక్తి ఓవర్ నైట్ ఇంటర్నెట్ స్టార్ అయిపోయాడు. డిఫరెంట్ గా థింక్ చేసి బైక్ కొన్నాడు, అందరి దృష్టిని ఆకర్షించి వార్తల్లోకి ఎక్కాడు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంక్ అకౌంట్ లేని వారుండరు. దీంతోపాటు స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామంది ఆన్లైన్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

కానీ ఓ యువకుడు అందరిలా నేనెందుకు చెయ్యాలి అనుకున్నాడో ఏమో. స్నేహం కోసం మూవీలో చిరంజీవి, విజయ్ కుమార్ కారు కొనడానికి వెళ్లి డబ్బు నోట్ల బస్తా ఇచ్చి షో రూమ్ లో ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేస్తారు. అంతకుమించి అనిపించేలా ఓ యువకుడు ఏకంగా చిల్లర నాణేల బ్యాగ్స్ ఇచ్చి బైక్ షోరూం సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేశాడు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన భూపతి అనే యువకుడు చిల్లరతో బైక్‌ను కొనుగోలు చేశాడు. దాదాపు రూ.2.60 లక్షలు మొత్తం రూపాయి నాణేలను చెల్లిస్తాననడంతో షోరూమ్ నిర్వాహకులు సైతం అవాక్కయ్యారు. ఇక చేసేదేమీ లేక దాదాపు 10 గంటలు కష్టపడి నాణేలను లెక్కించి డామినర్ బైక్‌ను యువకుడికి అప్పజెప్పారు. దీనిపై యువకుడు సమాధానమిస్తూ.. మూడేళ్ల నుంచి బైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నానని.. అందుకోసం నిత్యం చిల్లరను పోగుచేశానని చెప్పారు. చిన్న చిన్న హోటల్స్, టెంపుల్స్ వద్ద తన దగ్గర ఉన్న మనీ నోట్స్ తో ఎక్స్ చేంజ్ చేసి రూ. 2.60 లక్షల చిల్లర నాణేలను సంపాదించినట్టు భూపతి చెబుతున్నాడు.

స్నానం చేయ‌ట్లేద‌ని విడాకులు.. బ‌ట్టల్లేకుండా బ‌య‌ట‌కెళ్తానంటూ భార్య‌?



Next Story

Most Viewed