భూ తగాదాలో వ్యక్తి పై కత్తితో దాడి..

by Batti.Sumithra |

భూ తగాదాలో వ్యక్తి పై కత్తితో దాడి చేసిన సంఘటన మండలంలోని దామెర గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రం వద్ద మంగళవారం జరిగింది.

భూ తగాదాలో వ్యక్తి పై కత్తితో దాడి..
X

దిశ, ఎల్కతుర్తి : భూ తగాదాలో వ్యక్తి పై కత్తితో దాడి చేసిన సంఘటన మండలంలోని దామెర గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రం వద్ద మంగళవారం జరిగింది. ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల మేరకు భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పోలు కుమార్ అనే రైతు పై, దామర గ్రామానికి చెందిన విష్ణు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కుమార్ కు మెడ భాగంలో కత్తి గాయాలు కాగా అతని కొడుకు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలు కుమార్, కాసురబోయిన ఐలయ్య ఇద్దరు ఒకే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశారు. వీరి మధ్య నాలుగు గుంటల భూమి తేడా రావడంతో పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కసురబోయిన ఐలయ్య కుమారుడు విష్ణు వెంట తెచ్చుకున్న కత్తితో, కుమార్ పై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతని కుమారుడి పై దాడికి ప్రయత్నం చేయగా అతను తప్పించుకున్నాడు. కత్తితో దాడి చేసిన యువకుడు బైకు పై పారిపోయాడు. కుమార్ కుటుంబ సభ్యులు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story