- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల అనంతర హింస పై మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన దీక్ష
ఎన్నికల అనంతర హింసను నిరసిస్తూ కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ వద్ద ఒకరోజు ధర్నాకు దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ పార్టీ (TMC party) ఘోర ఓటమి చెంది బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల అనంతరం వివిధ ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం హింస చెలరేగింది. ఇందులో టీఎంసీ కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా చేసుకొని పులువురు దాడులు చేశారు. ఈ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతాలో ఒకరోజు ధర్నాకు దిగారు. కోల్‌కతాలోని ప్రముఖ సెంట్రల్ ప్రాంతమైన ఎస్ప్లానేడ్ వై-ఛానల్ (Esplanade's Y-channel) వద్ద మమతా బెనర్జీ ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అయితే, ఈ నిరసన ప్రదర్శన నిర్వహణకు సంబంధించి పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురయ్యాయి. దీని పక్కనే ఉన్న రాణి రాష్మణి రోడ్ (Rani Rashmani Road)లో ధర్నా చేపట్టేందుకు టీఎంసీ చేసిన అభ్యర్థనను కోల్‌కతా పోలీసులు (Kolkata Police) తిరస్కరించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ అక్కడ కూడిన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమకు నిరసన వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కానీ, మైకులు ఉపయోగించడానికి కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె మెగాఫోన్ ద్వారానే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.






