- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు: రామచందర్ రావు
మమతా బెనర్జీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. మే 7తో ఆమె పదవీకాలం ముగుస్తుందని, రాజీనామా చేయకున్నా ఆమె సీఎం హోదా కోల్పోతారని స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేస్తూ.. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ప్రవర్తనపై రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ ఉత్కంఠ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramachandra Rao) ఘాటుగా స్పందించారు. గత 15 ఏళ్లుగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మమతా బెనర్జీ, ఇప్పుడు స్వయంగా రాజ్యాంగాన్ని ధిక్కరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించకుండా, రాజీనామా చేయనని భీష్మించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఆర్టికల్ 172 ప్రకారం ముఖ్యమంత్రి పదవీ కాలం ఐదేళ్లు మాత్రమేనని, ఆ గడువు ముగియగానే పదవి నుంచి వైదొలగాల్సిందేనని రామచందర్ రావు స్పష్టం చేశారు. అలాగే ఆర్టికల్ 164 ప్రకారం అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీ నేతను ముఖ్యమంత్రిగా నియమించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని తెలిపారు. మమతా బెనర్జీ రాజీనామా చేసినా, చేయకపోయినా.. ఆమె పదవీ కాలం ముగిసే మే 7వ తేదీ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతను కోల్పోతారని ఆయన తేల్చి చెప్పారు. రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ కూడా ఈ నిబంధనలను చదువుకోవాలని ఈ సందర్భంగా రామచందర్ రావు ఎద్దేవా చేశారు.






