- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
serum: ఇంట్లోనే ఈ సీరం రెడీ చేసుకోండి.. స్కిన్ బిగుతుగా మారడంతో పాటు..?
చాలా మంది అమ్మాయిలు చర్మ రక్షణ కోసం ఫేస్ సీరం వాడుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది అమ్మాయిలు చర్మ రక్షణ కోసం ఫేస్ సీరం (Face serum)వాడుతుంటారు. ఫేస్ సీరమ్‌లు చర్మం ఉపరితలాన్ని ఎక్స్‌ఫోలియేట్(Exfoliate) చేసి ఫేస్‌పై ఉన్న హోల్స్‌ను మూసివేసేందుకు మేలు చేస్తుంది. అంతేకాకుండా.. చర్మాన్ని ప్రకాశవంతం(bright...) చేస్తుంది. ఇందులోని పదార్థాలు చర్మ కణాల టర్నోవర్‌ను ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ సీరం ఎప్పుడైనా సరే.. శుభ్రం చేసిన ముఖంపై సీరమ్‌ను అప్లై చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే సీరమ్‌ను ఫేస్‌పై సున్నితంగా మసాజ్ చేయాలి. సీరమ్‌ను మాయిశ్చరైజర్(Moisturizer)కు ముందు అప్లై చేయడం బెటర్.
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న ఏజ్‌లోనే స్కిన్ ముడతలు(Wrinkles) రావడం, పొడిబారడం వంటివి స్టార్ట్ అవుతున్నాయి. కాగా ఈ క్రమంలో మహిళలు తమ ఫేస్‌పై కేర్ తీసుకోవడం మొదలు పెడుతారు. ముఖాన్ని యవ్వనంగా మార్చుకునేందుకు పలు రకాల బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొంతమంది అయితే ముఖం అందంగా మెరిసిపోవాలని వేలల్లో ఖర్చు పెట్టేందుకు అయినా వెనకాడరనుకోండి. మరికొంతమంది ఇంట్లోనే పలు చిట్కాలు కూడా ఫాలో అవుతుంటారు.
కానీ ప్రకాశవంతమైన ఫేస్ కోసం ఇంట్లోనే ఫేస్ సీరం తయారుచేసుకోవచ్చని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. మరీ ఈ సీరం తయారీకి ఏయే పదార్థాలు తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం..
ఫేస్ సీరం తయారీకి కావలసిన పదార్థాలు:
విటమిన్ ఇ ఇ క్యాప్సూల్స్- 1, అలోవెరా జెల్(Aloe vera gel) ఒక స్పూన్లు, ఒక చిన్న గాజు సీసా, విటమిన్ సి క్యాప్సూల్స్(Vitamin C capsules) రెండు, రోజ్ వాటర్ రెండు స్పూన్లు, గ్లిజరిన్(Glycerin) ఒక స్పూన్ తీసుకోవాలి.
తయారీ విధానం చూసినట్లైతే..
బౌల్ తీసుకుని కలబంద జెల్ అండ్ రోజ్ వాటర్, విటమిన్ ఇ, సి క్యాప్యూస్ అందులో వేసుకోవాలి. తర్వాత వీటిలోనే గ్లిజరిన్ వేసి.. మిశ్రమాన్నంతా కలుపుకోవాలి. దీన్ని ఒక గాజు సీసాలో ఉంచాలి. ఇప్పుడు వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్(fridge)లో స్టోర్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే విటమిన్ సి అండ్ గ్రీన్ టీ(Green tea) సీరం కూడా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి. ఇందుకోం విటమిన్ సి, గ్రీన్ టీ పౌడర్, అలోవెరా జెల్ తీసుకుని కలపాలి. దీన్ని ఫేస్ కు డైలీ రెండు సార్లు అప్లై చేస్తే స్కిన్ మెరిసిపోవడమే కాకుండా.. బిగుతుగా మారేందుకు మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.






