- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపాలిటీ బ్లీచింగ్ గోడౌన్ భారీ అగ్నిప్రమాదం
మున్సిపల్ బ్లీచింగ్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 500 బస్తాల బ్లీచింగ్ పౌడర్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

దిశ, వెబ్ డెస్క్: మున్సిపాలిటీ బ్లీచింగ్ గోడౌన్ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని దాదాపు 500 బస్తాల బ్లీచింగ్ కాలిపోయింది. ఈ షాకింగ్ సంఘటన ఏపీలోని రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ప్రధాన బ్లీచింగ్ పౌడర్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే.. నిమిషాల వ్యవధిలోనే మంటలు గోడౌన్ అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగలు, మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు గోడౌన్‌లో నిల్వ ఉంచిన సుమారు 500 బస్తాల బ్లీచింగ్ పౌడర్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire Department) ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బ్లీచింగ్ కెమికల్ కారణంగా దట్టంగా పొగలు వ్యాపిస్తుండటంతో స్థానిక నివాసితులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య (Sanitation) పనుల నిమిత్తం రోజువారీగా వాడే బ్లీచింగ్ పౌడర్‌ను మున్సిపల్ అధికారులు ఇక్కడి నుంచే అన్ని డివిజన్ లకు సరఫరా చేస్తుంటారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






