దిల్‌రాజు vs మహేష్ బాబు.. గెలుపెవరిదో?

by Web Desk |
దిల్‌రాజు vs మహేష్ బాబు.. గెలుపెవరిదో?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో గతకొన్ని రోజులుగా వరుస క్లాషెస్ జరుగుతున్నాయి. సినిమా విడుదల తేదీల విషయంలో స్టార్ హీరోల మధ్య పోరు మొదలవుతోంది. అయితే నిర్మాతల మీటింగ్‌తో వీటికి చెక్ చెప్పినా ఇప్పటికీ కొన్ని సినిమాలు క్లాష్ అవుతున్నాయి. తాజాగా మహేష్ vs దిల్‌రాజు మధ్య పోరు మొదలు కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్3, మహేష్ నిర్మాణంతో రానున్న 'మేజర్' రెండూ ఒకే రోజు రిలీజ్ రెడీ అయ్యాయి. నిజానికి 'ఎఫ్3' మూవీ ఏప్రిల్ 28న విడుదల కావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ చిరు 'ఆచార్య' ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. దాంతో 'ఎఫ్3' వాయిదా పడింది. ఈ మూవీని మే 27న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అడవి శేష్ హీరోగా వస్తున్న 'మేజర్' కూడా ఇదే రోజున విడుదలకు సిద్ధం అయింది. దీంతో 'ఎఫ్3'vs'మేజర్' పోరు మొదలైంది. ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మే 27 వరకు వెయిట్ చేయాల్సిందే.


Next Story

Most Viewed