Eknath Shinde: బల పరీక్షలో ఏకనాథ్ షిండేకు సంపూర్ణ మెజారిటీ

by Malleboina Mahesh |   (  Updated:2022-07-04 06:53:42  IST  )

Maharashtra CM Eknath Shinde Wins Floor Test In Assembly| మహారాష్ట్ర అసెంబ్లీ బల పరీక్షలో ఏక్‌నాథ్ షిండే సంపూర్ణ మెజారిటీతో గెలుపొందాడు. గత పది రోజులుగా మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర

Maharashtra CM Eknath Shinde Wins Floor Test In Assembly
X

దిశ, వెబ్‌డెస్క్: Maharashtra CM Eknath Shinde Wins Floor Test In Assembly| మహారాష్ట్ర అసెంబ్లీ బల పరీక్షలో ఏక్‌నాథ్ షిండే సంపూర్ణ మెజారిటీతో గెలుపొందాడు. గత పది రోజులుగా మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏన్‌నాథ్ షిండే ఎన్నికయ్యాడు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే ఈ రోజు లోక్ సభలో బలపరీక్షను ఎదుర్కొన్నాడు.

ఈ బల పరీక్షలో ఏక్ నాథ్ షిండే సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులుండగా.. మెజరిటి కావాలంటే 145 మంది సపోర్ట్ ఉండాలి. కానీ ఏక్‌నాథ్ షిండేకు 164 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు. దీంతో మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర పడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేల ప్రభుత్వం ఏర్పాటయింది.

Next Story