- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీర కట్టు.. నుదుటన బొట్టు.. కేన్స్‌లో అదరగొట్టిన భారత నటి
చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival)లో అదరగొట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival)లో అదరగొట్టింది. ప్రముఖ మహారాష్ట్ర నటి ప్రజక్తా మాలి(Prajakta Mali) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సాంప్రదాయిక లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పాశ్చాత్య దుస్తుల హడావుడి ఎక్కువగా ఉండే ఈ అంతర్జాతీయ వేదికపై, ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర అలంకరణతో దర్శనమిచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారదర్శకమైన ఎరుపు రంగు చీర కట్టు, నుదుటన పెద్ద బొట్టు, సాంప్రదాయిక జుడా(కొప్పు), మహారాష్ట్రీయ ప్రత్యేక ఆభరణాలతో ప్రజక్తా ఎంతో హుందాగా, ఎలగంట్‌గా కనిపించింది.
తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఏడాది కేన్స్‌కు వెళ్లిన ప్రజక్తా మాలి.. అక్కడ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా చాటిచెప్పింది. ఆమెకు సంబంధించిన ఈ సారీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ వేదికపై భారతీయ మూలాలను అద్భుతంగా ప్రదర్శించిందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట ఈ లుక్ ప్రస్తుతం "భారతీయ సౌందర్యం"(Indian Beauty) అనే ట్యాగ్‌తో భారీగా ట్రెండ్ అవుతోంది.






