డ్రమ్ములో కుక్కిన బాలిక మృతదేహం వీడియో వైరల్.. మాటలకందని విషాదం

by Muthe.Rajitha |   (  Updated:2026-02-18 06:41:00  IST  )

నిన్న జరిగిన మదనపల్లి బాలిక హత్యాచారం ఘటనలో.. నీటి డ్రమ్ములో కుక్కిన బాలిక డెడ్ బాడీ వీడియో వైరల్ అవుతోంది.

డ్రమ్ములో కుక్కిన బాలిక మృతదేహం వీడియో వైరల్.. మాటలకందని విషాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఏడేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కులవర్ధన్ అనే వ్యక్తి ఎదురింట్లో ఉండే ఏడేళ్ల బాలికపై రేప్ చేసి, అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని తన ఇంట్లోనే నీటి డ్రమ్ములో కుక్కినట్టు పోలీసులు గుర్తించారు. కాగా హత్యాచారం అనంతరం నిందితుడు పారిపోగా.. పోలీసులు ఇంటితాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అక్కడ హృదయవిదారక దృశ్యం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. నగ్నంగా ఉన్న బాలికను, కొన ఊపిరి ఉండగానే కాళ్ళు చేతులు విరిచి నీటి డ్రమ్ములో కుక్కిన మృతదేహాన్ని చూడగానే తల్లితండ్రులు గుండెలవిసేలా రోధించారు. ప్రతిరోజూ నిందితున్ని అన్నా.. అన్నా అని పిలిచేదని, ఘటన సమయంలో బాలిక ఎంత నరకం అనుభవించి, ఎంత ఆర్తనాదాలు చేసిందోనని.. బాలిక మృతదేహాన్ని చూసి చుట్టుపక్కల వారు భోరున ఏడ్చారు.

అయితే అత్యాచారం చేసి, డ్రమ్ములో ముంచి చంపినట్టు ఎపి డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు ఘటన అనంతరం పరారైన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కురబలకోట మండలం కంసానివారిపల్లె చెరువులో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని మృతిపై స్పందించిన బాలిక తల్లి.. కులవర్ధన్ బతికి ఉంటె తానె చంపేసేదాన్ని అని మీడియాకు తెలిపింది. ఇక ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేసారు. బాలిక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. నారా లోకేష్ సహా పలువురు మంత్రులు బాధితురాలి కుటుంబంతో మాట్లాడి, అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story