Today's horoscope:ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. మేషం నుండి మీనం వరకు నేటి రాశి ఫలాలు

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు(శుక్రవారం) రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Todays horoscope:ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. మేషం నుండి మీనం వరకు నేటి రాశి ఫలాలు
X

ద్వాదశ రాశి ఫలాలు

మేష రాశి

ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా వేతన పెంపునకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో చిన్నపాటి ఒడిదుడుకులు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. దైవ దర్శనం మానసిక శాంతిని ఇస్తుంది.

మిథున రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. సంతానం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి

పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారం తక్కువగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహ రాశి

నేడు మీకు అనుకూలమైన రోజు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కన్య రాశి

మిత్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగవంతం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది.

తులా రాశి

ఈ రాశి వారు నేడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పాత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి అనుకూల ఫలితాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. వైవాహిక జీవితం బాగుంది.

ధనుస్సు రాశి

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం.

మకర రాశి

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వంపై దృష్టి పెట్టాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయండి. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.

కుంభ రాశి

కుటుంబ సభ్యుల సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

మీన రాశి

జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. పనుల వల్ల అలసటగా అనిపించవచ్చు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. పిల్లలతో గడపడనికి ఇష్టపడతారు.

Next Story