ఐపీఎల్ చరిత్రలోనే లక్నో చెత్త రికార్డు

by Malleboina Mahesh |

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు! సూపర్ ఓవర్‌లో 1 పరుగుకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్. పంజాబ్ పాత రికార్డును అధిగమించిన లక్నో బ్యాటర్లు.

ఐపీఎల్ చరిత్రలోనే లక్నో చెత్త రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో వేదికగా జరిగిన LSG, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన రికార్డుకు సాక్ష్యంగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు 155 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే, ఈ నిర్ణయాత్మక ఓవర్‌లో లక్నో జట్టు ఘోరంగా విఫలమైంది. సునీల్ నరైన్ వేసిన అద్భుతమైన స్పెల్‌లో లక్నో బ్యాటర్లు కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో సూపర్ ఓవర్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా లక్నో తన పేరిట ఒక చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

అంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ (2020లో ఢిల్లీపై 2 పరుగులు) పేరిట ఉండగా, లక్నో ఇప్పుడు అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేవలం 2 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, రింకూ సింగ్ బాదిన ఫోర్‌తో మొదటి బంతికే విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ సూపర్ ఓవర్‌లలో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన రికార్డు (20 పరుగులు) సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉండటం గమనార్హం. ఒకే మ్యాచ్‌లో ఒక జట్టు కనీస స్కోరు రికార్డును నమోదు చేయడం, మరో జట్టు కేవలం ఒక్క బంతితోనే సూపర్ ఓవర్ గెలవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Next Story