ప్రియురాలు కోసం ప్రియుడు ఆ పని చేసిండు!

by Disha Web Desk 13 |
ప్రియురాలు కోసం ప్రియుడు ఆ పని చేసిండు!
X

దిశ, కామారెడ్డి రూరల్: ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదోనన్న భయంతో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో నివాసముండే అఖిల్ ఆర్కే డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన ఓ అమ్మాయితో 5 సంవత్సరాల క్రితం అఖిల్ కు పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది.


గత కొన్ని రోజులుగా అమ్మాయి.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామని అఖిల్ కు చెప్పింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఖిల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అఖిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed