బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై లోక్ భవన్ కీలక నిర్ణయం

by Malleboina Mahesh |

బెంగాల్ పౌరులకు లోక్ భవన్ శుభవార్త! ఎన్నికల వేళ సహాయం మరియు ఫిర్యాదుల కోసం 24x7 హెల్ప్‌లైన్ సేవలు మే 10 వరకు పొడిగింపు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై లోక్ భవన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోల్‌కతాలోని లోక్ భవన్ పౌరుల భద్రత, సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలపై గతంలో ఏర్పాటు చేసిన 24x7 సిటిజన్ హెల్ప్‌లైన్ సేవలను మే 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, అలాగే ఏదైనా వేధింపులు, బెదిరింపులు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేయడానికి ఈ హెల్ప్‌లైన్ వేదికగా నిలవనుంది.

పౌరులు అందించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని, సంబంధిత అధికారుల సమన్వయంతో సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని లోక్ భవన్ హామీ ఇచ్చింది. ప్రస్తుత ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ భవన్ వర్గాలు తెలిపాయి. పౌరులు సహాయం కోసం వివిధ ల్యాండ్‌లైన్ నంబర్ల ద్వారా, [email protected] ఈమెయిల్ ద్వారా తమ ఫిర్యాదులను పంపవచ్చని తెలిపింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రజలకు అండగా ఉండేందుకు ఈ సేవలను మే 10 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు లోక్ భవన్ అధికారులు స్పష్టం చేశారు.

Next Story